నగర అభివృద్ధే మా ధ్యేయం..

నగర అభివృద్ధే మా ధ్యేయం..

మేయర్ గా బాధ్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణి..


నిజామాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తూ నగర అభివృద్ధే మా ధ్యేయమని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. ఇవాళ‌ నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం, టిపిసిసి అధ్య క్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూప తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారి సమక్షం లో వేద పండితుడి ప్రత్యేక పూజల మధ్య మేయర్ కూరగాయల ఉమారాణి బాధ్యతలు చేపట్టారు.

ఎన్నికల వరకు ఆమె ఒక సాధారణమైన మహిళ. నిజామాబాద్ నగరంలోని 49వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొ రేటర్ గా టికెట్ లభించ డంతో ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఇవాళ‌ అధికారికంగా మేయర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, 60డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేయర్ కు శుభాకాంక్షల వెల్లువ…

అధికారికంగా బాధ్యతలు చేపట్టిన నగర మేయర్ కూరగాయల ఉమారాణి కి మంత్రులు, టిపిసిసి అధ్య క్షులు, ప్రభుత్వ సలహా దారు, నగరపాలక సంస్థ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, వివిధ పార్టీల నాయకులు తదితరులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply