చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ…
మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలు(liquor stores) నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయొద్దని కోరుతూ మోత్కూర్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్(Grievances)లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు(Hanumantha Rao)కి ఫిర్యాదు అందజేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విష్ణుమూర్తి(Vishnu), స్థానిక సీఐ రవిచంద్ర రెడ్డిలకు చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలిమెల నరసయ్య, ఎడ్ల నరేష్, అన్నెపు వెంకట్ , మందుల సురేష్, బొమ్మగాని ఉప్పలయ్య, గుజ్జ సోమనర్సయ్య, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

