ఓర్వకల్లు మండలం గని సమీపంలో ఉన్న సోలార్ పార్క్, గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, విండ్ పవర్ ప్రాజెక్ట్ లను పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అప్పర్ ఇన్ టేక్ పాయింట్ రిజర్వాయర్ నుండి నీటిని పైపు ల ద్వారా టర్బైన్ ల వరకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే చరిత వెంకటరెడ్డి వెంకటరెడ్డి తో పాటు గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని ఇది కేంద్ర ప్రభుత్వ పని చేసే విధానమని తెలిపారు. ఈ ప్రాజెక్టు 60 సంవత్సరాలు పైగా పనిచేసే సామర్థ్యం కలదని ఈ ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు.
కేవలం సోలార్ విద్యుత్ పైనే ఆధారపడి ఉండకూడదని ప్రత్యామ్నాయంగా గాలి విద్యుత్తు, నీటి విద్యుత్తు ను వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో 4,000 మెగా వాట్స్, సౌర, 1,000 మెగావాట్స్ పవన మరియు 1,680 మెగా వాట్స్ పంప్ చేయబడిన జలవిద్యుత్ ఉత్పత్తి ఉన్నాయని తెలిపారు.
గ్రీన్ కో కంపెనీ హైడ్రోజన్ పవర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని దేశంలోని 20 రాష్ట్రాలలో వీరు వీటిని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.ఈ విధంగా దేశాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు అభినందలు తెలియజేశారు.
విలేకరుల సమావేశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, చిక్బల్లాపూర్ ఎంపీ జి.సుధాకర్ రెడ్డి, గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్, కర్నూల్ ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
గ్రీన్ కో సంస్థ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని అదే విధంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.
స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, నిల్వ డిమాండ్‌పై సరఫరా కోసం రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఇంధన భద్రతను పెంచడంలో, పర్యావరణ అనుకూల వనరులకు పరివర్తనను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో పాటు కర్నూలు బిజెపి జిల్లా ఇన్చార్జి అంకాల రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.