Operation Trashi | జ‌మ్మూలో ఎన్ కౌంట‌ర్ – ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్ – ఉగ్రవాదానికి అడ్డాగా మారుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ ట్రాషి పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వ‌హిస్తున్నారు.. దీనిలో భాగంగా పోలీసులు, బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ఇంటిని చుట్టు ముట్టాయి భ‌ద్ర‌తా ద‌ళాలు. దాదాపు 4 గంటల పాటు ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ఎన్ కౌంటర్ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని సింగ్‌పోరా (చత్రూ) ప్రాంతంలో జరిగింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం , జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి.ఈ ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్ర‌వాదుల‌కు లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *