Operation Hawk Eye Straikes : 70 ఐఎస్ స్థావరాలు ధ్వంసం
ప్రతీకార చర్యగా.. పెంటగాన్ వెల్లడి
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ )
ఇటీవల సిరియాలో ముగ్గురు అమెరికన్లను బలి తీసుకున్న ఐఎస్ ఉగ్ర స్థావరాలపై (Operation Hawk Eye Straikes) అమెరికా దాడులకు ఉపక్రమించింది. శనివారం సుమారు 70 స్థావరాలను ధ్వంసం చేసినట్టు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ట్వీట్ చేశారు.

సిరియా భూభాగంలో జరిగిన ఆకస్మిక దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు. ఒక అమెరికన్ అనువాదకుడు మరణించిన విషయం విధితమే. ఇందుకు ప్రతీకారంగా.. సిరియా పౌరులు తమ దేశానికి రాకుండా ట్రావెల్ వీసాలను అమెరికా నిషేధించింది. మధ్య సిరియాలోని ఐఎస్ ఉగ్ర స్థావరాలపై అమెరికా ఫోకస్ పెట్టింది.

70 పైగా ఐఎస్ (70 Targets) ఆయుధగారాల లక్ష్యాలను ధ్వంసం చేస్తూ తమ సైన్యం పెద్ద ఎత్తున (Lorge scale attacks) దాడి చేసిందని, మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. ఈ దాడిని “ఆపరేషన్ హాక్ ఐ స్ట్రయిక్ (( ( Operation Hawk Eye Straikes )” ఆయన పేర్కొన్నారు. తన పోస్ట్‌లో “ఇది యుద్ధం ప్రారంభం కాదు – ఇది ప్రతీకార చర్య . అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో, అమెరికా ప్రజలను రక్షించడానికి అమెరికా భద్రతదళాలు ఎప్పుడూ వెనుకాడవు, “ఈరోజు, మేం మా శత్రువులను వేటాడాం, చంపాం. చాలా మందిని చంపేశాం. ఆగేది లేదు ” అని ఆయన జోడించారు.

2014లో సిరియా, ఇరాకీ భూభాగాలను స్వాధీనం చేసుకున్న ISతో పోరాడటానికి ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజొల్వ్ (Operation Inharant Resolve)కు అమెరికా మద్దతు ఇస్తోంది. ప్రతిగా అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఐఎస్ దాడులు జరిపింది.
“సిరియాలో అమెరికా దేశభక్తులను ISIS దారుణంగా చంపినందుకు” ప్రతి స్పందనగా ప్రతీకారం తీర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రక్తంతో తడిసిన సిరియాలోని ISIS స్థావరాలపై దాడి చేస్తున్నాం, ఇది ISISని నిర్మూలించగలిగితే ఉజ్వల భవిష్యత్తు ఉన్న సిరియాకు తన గొప్పతనాన్ని తిరిగి ఇవ్వటానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాం, సిరియా ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది .” అని ట్రంప్ అన్నారు.
దాడుల కథ మళ్లీ మొదటికి..

ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ భద్రత మండలి సంకీర్ణానికి సిరియా సహకరిస్తోంది, గత నెలలో వైట్ హౌస్ ను సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ -షరా సందర్శించినప్పుడు ఒక ఒప్పందానికి వచ్చారు. కాగా.. ఇటీవల అమెరికన్ త్రయంపై దాడి చేసిన వ్యక్తిని ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడిగా అనుమానిస్తున్నారు. అతడు సిరియన్ భద్రతా దళాల సభ్యుడపి సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ వర్ణించింది.

13 ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత గత ఏడాది నాయకుడు బషర్ అల్-అసద్ ను ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాజీ తిరుగుబాటుదారులు ఇప్పుడు సిరియా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు, ఇస్లామిక్ స్టేట్ తో ఘర్షణ పడిన సిరియా మాజీ అల్ ఖైదా శాఖ సభ్యులు కూడా ఉన్నారు. అమెరికా దాడులపై సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తర పోస్టులో , సిరియా భూభాగంలో ఐఎస్ కు సురక్షిత స్వర్గధామాలు లేవు అన్నారు. ఇక సిరియాలో అమెరికా ఉనికిపై అధ్యక్షుడు ట్రంప్ సందేహాస్పదంగా ఉన్నారు తన మొదటి పదవీ కాలంలో దళాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు, కానీ చివరికి అమెరికన్ దళాలను దేశంలోనే వదిలి వేశారు.
సిరియాలో అమెరికన్ సిబ్బంది సంఖ్యను సగానికి తగ్గిస్తుందని ఏప్రిల్‌లో పెంటగాన్ ప్రకటించింది, తమ స్థావరాలను తగ్గిస్తామని సిరియాకు అమెరికా రాయబారి టామ్ బరాక్ చెప్పారు. తాజాగా అమెరికా దాడులకు దిగటంతో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ALSO READ : 17years jail| ఇమ్రాన్ ఖాన్ దంపతులకు

