Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News

  • ఆపరేషన్ అజయ్ 2.0
  • ప‌శ్చిమాసియా టెన్ష‌న్ టెన్ష‌న్
  • గగనతలం మూసివేత..
  • 444 అంతర్జాతీయ విమానాలు రద్దు
  • గల్ఫ్ దేశాల్లో భ‌యోత్పాతం
  • 90 లక్షల భారతీయులు బిక్కుబిక్కు
  • తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
  • ఎంబసీలు, కంట్రోల్ రూములు 24/7 అలర్ట్
  • గల్ఫ్ దేశాల్లో సహాయక శిబిరాల ఏర్పాటు
  • ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రత్యేక హెల్ప్‌లైన్లు

(ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూస్ నెట్ వ‌ర్క్ ప్ర‌తినిధి )

Operation Ajai 2.0

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య జ‌గ‌డంలో వేలు పెట్టి ఆప‌రేష‌న్ రోర్ ల‌య‌న్‌.కకు అమెరికా ఆజ్యం పోసి యుద్ధాన్ని సృష్టిస్తే.. బంగారు పుట్ట‌లో వేలఉ పెడితే కుట్టనా అనే రీతిలో.. ఇరాన్ ప్ర‌తిదాడికి దిగ‌టంతో ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ వాతావ‌ర‌ణం తారాస్థాయికి చేరింది.

Operation Ajai 2.0

గ‌ల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ మూకుమ్మ‌డి దాడికి దిగింది. ఈ నేప‌థ్యంలో ఇరాన్‌, గ‌ల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావ‌ర‌ణంలో 90 ల‌క్ష‌ల మంది భార‌తీయులు చిక్కుకున్నారు. వీరిలో 20 ల‌క్ష‌ల మంది ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు ఉన్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో గగనతలం (Airspace) మూసివేత కారణంగా మార్చి 1, 2026న దాదాపు 444 అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. .

Operation Ajai 2.0 : భార‌త్ స‌న్న‌ద్ధం

Operation Ajai 2.0

భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. యుద్ధ తీవ్రత పెరిగితే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ‘ఆపరేషన్ అజయ్ 2.0స కి స‌న్న‌ధ్దం అవుతోంది. భారీ తరలింపు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భారత వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు, నౌకాదళం సిద్ధంగా ఉన్నాయి.

Operation Ajai 2.0 : గ‌ల్ఫ్ లో భ‌యోత్పాతం

Operation Ajai 2.0

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య జ‌గ‌డంలో మ‌ధ్య‌న అమెరికా సృష్టించిన ఆపరేషన్ రోరింగ్ లయన్ .తో . ప‌శ్చిమాసియా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతోంది. త‌మ సుప్రీంను ఇజ్రాయెల్ , అమెరికా క‌లిసి అంతం చేయ‌టంతో.. ఇరాన్ చెల‌రేగిపోతోంది. అమెరికా సైనిక స్థావ‌రాల‌కు విడిది క‌ల్నించిన గ‌ల్ఫ్ దేశాల‌పై క్షిప‌ణుల‌ను కుమ్మ‌రిస్తోంది. ఫ‌లితంగా ప‌శ్చిమాసియాలో టెన్ష‌న్ టెన్ష‌న్ ..భ‌యం భ‌యం భ‌యోత్పాతం నెల‌కొలంది. ఈ యుద్ధ వాతావ‌ర‌ణంలో ఇప్పుడు
90 ల‌క్ష‌ల మంది భార‌తీయులు చిక్కుకున్నారు. వీరిలో 20 ల‌క్ష‌ల మంది ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు ఉన్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో గగనతలం (Airspace) మూసివేత కారణంగా మార్చి 1, 2026న దాదాపు 444 అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. ఇప్ప‌టికే ఇరాన్ మూకుమ్మ‌డి దాడితో దుబాయ్‌, షార్జా, బ్ర‌హెయిన్‌, కువైట్ ల్లో జ‌నం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Operation Ajai 2.0 : భార‌త్ అప్ర‌మ‌త్తం

Operation Ajai 2.0

యుద్ధ తీవ్రతను భార‌త ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఈ తీవ్ర‌త పెరిగితే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ‘ఆపరేషన్ అజయ్ 2.0స కి భార‌త్ స‌న్న‌ధ్దం అవుతోంది. భారీగా జ‌నం తరలింపున‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భారత వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల‌రు, నౌకాదళం సిద్ధంగా ఉన్నాయి.

Operation Ajai 2.0

“మా పౌరుల భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యత” అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది. అనవసర ప్రయాణాలు చేయవద్దని, స్థానిక ప్రభుత్వాల సూచనలు పాటించాలని భారత విదేశాంగ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భాన‌తీయుల‌కు హెచ్చరికలు జారీ చేసింది.

Operation Ajai 2.0 : తెలుగు ప్ర‌జ‌ల్లో అల‌జ‌డి

Operation Ajai 2.0

దుబాయ్, బహ్రెయిన్, కువైట్ వంటి నగరాల్లో నిర్మాణ రంగాలు , సేవా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తెలుగు ప్ర‌జ‌లు సహా భారతీయులు ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వేతనాల చెల్లింపులు ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం క‌నిపిస్తోంది.
ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమ ఆసియాలో చిక్కుకున్న భారతీయ పౌరుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలే అత్య‌ధికంగా ఉన్నారు. ప్రభుత్వ అంచనాట ప్ర‌కారం, ఇరాన్‌లో సుమారు 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉండగా, కువైట్, యూఏఈ, ఖతార్ త‌దిత‌ర గ‌ల్ఫ్ దేశాల్లో్ సుమారు 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్‌లో నే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన సుమారు 1,500 నుండి 2,000 మంది చిక్కుకున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, వర్తకులు చమురు రంగ నిపుణులు కావ‌టం విశేషం . ఇరాన్ లోని టెహ్రాన్, ఇస్ఫాహాన్, కుమ్ (Qom) నగరాల్లో తెలుగు విద్యార్థులు, యాత్రికులు ఉన్నారు. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 15 లక్షల నుండి 20 లక్షల మంది తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువగా కార్మికులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. కువైట్ , దుబాయ్ లో నిర్మాణ రంగం (Construction).హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వ‌ల‌స జీవులు వేలాది మంది ఉన్నారు.

Operation Ajai 2.0 : విమాన సంస్థ‌లు అలెర్ట్

Operation Ajai 2.0

దుబాయ్, కువైట్, ఖతార్ దేశాల విమానాశ్రయాలపై దాడులు జ‌రిగాయి. మ‌రిన్ని దాడుల‌తో క్షిపణి ముప్పు ఉండటంతో, భారత్ నుంచి దుబాయ్, దోహా, కువైట్ వెళ్లే విమానాల‌ను రద్దు చేశారు. భారతీయ విమానయాన సంస్థలు పశ్చిమ ఆసియా గగనతలం (Airspace) మీదుగా ప్రయాణించవద్దని నిర్ణయించుకున్నాయి, దీనివల్ల యూరప్ వెళ్లే విమాన ప్రయాణ సమయం , ఛార్జీలు పెరిగాయి. గల్ఫ్ దేశాలకు కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలకు తన విమాన సర్వీసులను మార్చి 2, 2026 (రాత్రి 23:59 IST) వరకు ఇండిగో విమాన యాన సంస్థ నిలిపివేసింది. ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి నగరాలకు వెళ్లే విమానాలతో పాటు గల్ఫ్ సర్వీసులను ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ సంస్థ రద్దు చేసింది. ఫిబ్రవరి 28 లోపు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మార్చి 7 వరకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా టికెట్లను మార్చుకోవడానికి అవ‌కాశం క‌ల్పించింది. పూర్తి రీఫండ్ పొందేందుకు విమానయాన సంస్థలు అంగీక‌రించాయి. విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సరిచూసుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం సూచించింది. యుద్దం జ‌రుగుతున్న ప్రాంతాల్లోని భారతీయులు వెంటనే స్థానిక భారత రాయబార కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. విమానాల రద్దుతో భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు తమ వీసా పొడిగింపు కోసం సమీపంలోని FRRO కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

Operation Ajai 2.0 : హెల్ప్ లైన్లు ప్ర‌క‌ట‌న

  • ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఏర్పాటు చేసింది:
  • టోల్ ఫ్రీ నంబర్: 1800118797
  • ఫోన్ నంబర్లు: +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905
  • వాట్సాప్ (WhatsApp): +91-9968291988
  • ఈమెయిల్: situationroom@mea.gov.in
  • ఆయా దేశాల ఎంబసీ నంబర్లు:
  • కువైట్ (Kuwait): +965 65501946
  • దుబాయ్/UAE: టోల్ ఫ్రీ: 800-46342, వాట్సాప్: +971 543090571
  • ఖతార్ (Qatar): 00974-55647502
  • బహ్రెయిన్ (Bahrain): 00973-39418071
  • ఇరాన్ (Tehran): +98 9128109115, +98 9932179359
  • ఇజ్రాయెల్ (Tel Aviv): +972-54-7520711, +972-54-2428378

Operation Ajai 2.0 : గ‌ల్ఫ్ దేశాల్లో.. స‌హాయ కేంద్రాలివి

  1. దుబాయ్ UAE ప్రభుత్వం దుబాయ్ లో పెద్ద హోటళ్లు , పబ్లిక్ సెంటర్లను ‘సురక్షిత ప్రాంతాలు’గా ప్రకటించింది. భారత కాన్సులేట్ (Dubai Consulate) ఆధ్వర్యంలో అల్ ఖుసైస్ (Al Qusais), జెబెల్ అలీ (Jebel Ali) ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. ICWF (Indian Community Welfare Fund సంస్థ సహాయక బృందం: అత్యవసర వసతి, ఆహారం అంద‌జేస్తుందిస హెల్ప్‌లైన్: 800-46342.
  2. కువైట్ (Kuwait)

కువైట్ లోని దైయా (Daiya) ఏరియాలో భారత రాయబార కార్యాలయం ఆవరణలో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. అబ్బాసియా. ఫహహీల్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు సంఘాలు కూడా సహాయం అందిస్తున్నాయి. IDF (Indian Doctors Forum) సహాయక బృందం అందుబాటులో ఉన్నారు. వైద్య సహాయం అందిస్తారు. హెల్ప్‌లైన్: +965 65501946.

  1. ఖతార్ (Qatar) దోహాలోని ఐసిసి (Indian Cultural Centre) ని ప్రధాన సహాయక కేంద్రంగా మార్చారు. ఇక్కడి నుండి ఆహారం వసతి స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. ICBF (Indian Community Benevolent Forum) సహాయక బృందం అందుబాటులో ఉంది. హెల్ప్‌లైన్: +974 55647502.
  2. బహ్రెయిన్ (Bahrain)

మనామాలోని భారత రాయబార కార్యాలయం, ‘ఇండియన్ క్లబ్’ ప్రధాన శిబిరాలుగా పనిచేస్తున్నాయి. హెల్ప్‌లైన్: +973 39418071.

  1. తెలుగు రాష్ట్రాల్లో…

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు తమ ప్ర‌జ‌ల‌ భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశాయి: హైదరాబాద్‌లోని NRI సెల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ, బాధితులను తరలించడానికి ప్రయత్నిస్తోంది. హెల్ప్‌లైన్: 040-23220603.

ఏపీలోని ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విదేశాల్లోని బంధువుల స‌మాచారం అందిస్తోంది. 24/7 హెల్ప్‌లైన్: +91 85000 24455.

ALSO READ : deadly explosion : అదే సూర్య‌శ్రీ Andhra Prabha Crime St

Leave a Reply