Govt | ఇకనైనా కళ్లు తెరవండి..

Govt | ఇకనైనా కళ్లు తెరవండి..
నాగులపల్లి, ఆంధ్రప్రభ – రంగారెడ్డి జిల్లా (Rangareddy) ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి (Nagulapalli) గ్రామంలో పాఠశాల నుండి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్ (3) అనే బాలుడి పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రిత్విక్ పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారి పైన కూడా దాడి చేశాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణను చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
