Open Letter | “ఆపరేషన్ కగార్” ను నిలిపివేయండి … శాంతి చ‌ర్చ‌ల‌కు రండి:మూడోసారి మావోయిస్ట్ లు లేఖ

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో మావోలు వినతి చేశారు. తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు. కాగా.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

గతంలో కూడా రెండు రెండు, మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని ఆపరేషన్స్‌ను వెంటనే నిలిపివేయాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ – ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని వినతి చేస్తూ మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. మావోయిస్టు బస్తర్ ఇన్‌చార్జ్ రూపేష్‌ పేరుతోనే ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ లేఖపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కొనసాగుతోంది.

Leave a Reply