Ootkur | విద్యాభివృద్ధికి కృషి చేస్తాం..

Ootkur | విద్యాభివృద్ధికి కృషి చేస్తాం..
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నిడుగుర్తి సర్పంచ్ ఆవకోల్ల రాములు, ఉప సర్పంచ్ కుర్వ సంతోష్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయ బృందం నూతనంగా ఎన్నికైన సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు గ్రామస్తులు ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామ సమస్యలతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామనిఅన్నారు.
పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ కాంబ్లె మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు గ్రామభివృద్ధి తోపాటు పాఠశాల అభివృద్ధికి కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, మహమ్మద్ తకి, ధనుంజయ, శ్రీనివాస రావు, హిదయాతుళ్ళ, సుజాత, ఆంజనేయులు, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
