Ootkur | రైతు భరోసా చెల్లించాలి

Ootkur | రైతు భరోసా చెల్లించాలి
- సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహ్మ
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే ఉపగ్రహ చిత్రాలు పరిశీలించి యాసంగి రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పడం సరైంది కాదని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహ్మ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు సాగునీటి సౌకర్యాలు లేక వర్షం పై ఆధారపడి పత్తి, కంది, మొక్కజొన్న, ఆముదం పంటలు వేస్తారు అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటలు పరిశీలన చేసి యాసంగిలో పంటలు వేసిన వాటికి మాత్రమే రైతు భరోసా వేస్తాం అని ప్రకటించడంతో వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు నష్టపోతారన్నారు. ఎన్నికలలో సంవత్సరానికి ఎకరాకు 12 వేల రైతు భరోసా చెల్లిస్తామని ప్రకటించారని, ఖరీఫ్‌లోనే ఒకే సారి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం ఆరు నెలల తర్వాత రైతు భరోసా డబ్బులు వస్తాయని అనుకుంటే యాసంగిలో సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా వేస్తాం అని ప్రకటించడంతో వారు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. సీఎం అసెంబ్లీ సమావేశాలలో రైతులందరికీ ఎకరాకు 12 వేల రైతు భరోసా ఇస్తాం అని ప్రకటించాలని కోరారు. ఒకవేళ రైతు భరోసా ఇవ్వడానికి భారమైతే సాగు చేసిన 5 లేదా 10 ఎకరాల భూమికి మాత్రమే ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో వరి, ఉల్లిపాయ, మొక్కజొన్న పెసళ్ళు మొదలగు పంటల సాగు ప్రారంభమైంది. కావున వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో చిన్న నర్సింహా, కుర్మప్ప, రాఘవేంద్ర, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
