Ootkur | మహిళగా ఆదరించండి…

Ootkur | మహిళగా ఆదరించండి…

  • అభివృద్ధి చేసి చూపిస్తా..
  • పెద్దపోర్ల స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కాశమ్మ

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళగా ఆశీర్వదించి గెలిపిస్తే.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పెద్దపోర్ల సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బోయిన్ పల్లి కాశమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

గ్రామానికి ప్రతినిత్యం ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా చూస్తానని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి చెరువు కట్ట వద్ద రహదారి మరమ్మతులు చేపడతానన్నారు. మహిళగా పోటీ చేసేందుకు మంత్రి అవకాశం కల్పించారని, గ్రామస్తులు అందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. విద్యావంతులైన కుమారుల సహకారంతో ఇండ్లు, పింఛన్లు మంజూరు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో మహిళలు ఉండమ్మా బొట్టు పెడతా అంటూ ఆశీర్వదించి ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవికుమార్, మాజీ ఎంపీటీసీ పాత పల్లి శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply