సమాజానికి మెరుగైన సేవలు
ఏలూరులో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ ప్రారంభం
ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రభ బ్యూరో : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారు అని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు (SuryaChandraRao) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ కళ్యాణ మండపం లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ శిబిరాన్ని అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్పీ ప్రారంభించి, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విధుల్లో ఉండే పోలీసులు తమ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రక్త దాన శిబిరం…
అన్ని దానాలలో కెల్లా రక్త దానం మిన్న అని అన్నారు. ఆపద సమయంలో రక్త దానం చేయడం వలన ఇతరులకు ప్రాణ ధానము చేసిన వారు అవుతారు అని తెలిపారు. తలసీమియా బాధితులకు తరచుగా ఆ రక్తం అవసరం అవడం వలన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ అధికారులు, యువత, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు యువత, ప్రజలు పాల్గొని రక్త దానం చేసిన దానిపై జిల్లా అదనపు ఎస్పీ ప్రతి ఒక్కరిని అభినందించి పలు డ్రింక్ లను అందజేసి వారికి గుర్తింపు పత్రాలను అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్ర రావు అందజేశారు.
ఈ వైద్య శిబిరం లో జిల్లా పోలీస్ యూనిట్ డాక్టర్ ప్రవీణ్ ఎంబీబీఎస్, వాసన్ ఐ హాస్పిటల్ డాక్టర్ నితిన్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ సోనీ మోహన్, ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ హేమంత్ డాక్టర్ స్వరూపరెడ్డి, డాక్టర్ సి.శృతి, డాక్టర్ బిందు చౌదరి, డాక్టర్స్ శ్యామ్,డాక్టర్ గౌతమ్ లను అదనపు ఎస్పీ అడ్మిన్ గారు ప్రత్యకము గా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్,ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు,ఆర్ ఐ లు పవన్ కుమార్, ఆర్ ఐ సతీష్, ఎస్ఐ దుర్గ ప్రసాద్ ఆర్.ఎస్. ఐలు సత్యనారాయణ,వెంకటేష్ ,అమరేశ్వర రావు, ఈగల్ టీం ఆర్.ఎస్. ఐ ఉదయ భాస్కర్, సూర్యచక్రి లు పోలీస్ అధికారులు అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ నాగేశ్వర రావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

