online | పోలింగ్ కేంద్రాల సందర్శన
online | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి(Collector Deepak Tiwari) పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలు జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయం సందర్శించి ఎన్నికల పోలింగ్ ఆన్లైన్(online) తీరును పరిశీలించారు.
అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జైనూర్ మండల పంచాయతీ అధికారి భుక్యా శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.

