చేవెళ్ల ప్రమాదంలో తల్లితో పాటు ఏడాది చిన్నారి మృతి..
(ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి, చేవెళ్ల) : రంగారెడ్డి (Rangareddy) జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏడాది చిన్నారిని మొదలుకొని అరవై ఏళ్ల వయస్సు వారు మృత్యువాత పడ్డారు. ఏడాది వయస్సు ఉన్న చిన్నారి తల్లితోపాటు పాటు రోడ్డు ప్రమాదంలో మృతువాతపడ్డారు.
ఈ దృశ్యాలు కంట నీరు పెట్టించింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.

