One-way ticket price | రూ.9 లక్షలు

One-way ticket price | రూ.9 లక్షలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు (Iran-Israel war tensions) పెరగడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణం (air travel) ఇప్పుడు అత్యంత ఖరీదైన, ఇబ్బందికరమైన వ్యవహారంగా మారిపోయింది. దుబాయ్, అబుదాబీ, దోహా వంటి కీలక గల్ఫ్ విమానాశ్రయాలు మూతపడటం, ఎయిర్‌స్పేస్ మూసివేతలు, ఫ్లైట్ రద్దులు, రీ-రూటింగ్‌లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు వన్-వే టికెట్ ధర (One-way ticket price) రూ.9 లక్షలకు చేరుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది.
ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్ ధరలు రెట్టింపు, మూడింతలయ్యాయి. చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి, రీబుకింగ్, రీఫండ్ (Rebooking, refund) కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిపుణులు ఇప్పుడు అత్యవసరం కాని అంతర్జాతీయ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, టికెట్ బుక్ చేసుకునే ముందు ఎయిర్‌లైన్స్ అప్‌డేట్స్ తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే ధరలు మరింత పెరిగే అవకాశముంది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని విమానయాన సంస్థలు, ప్రయాణ సలహా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
