రూ.లక్ష విలువ కలప పట్టివేత..

రూ.లక్ష విలువ కలప పట్టివేత..

లోతుర్రెలో అటవీశాఖ అధికారుల సోదాలు


జన్నారం,నవంబర్ 8 (ఆంధ్రప్రభ ):మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లోతుర్రే గ్రామంలో శుక్రవారం రాత్రి అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి,రూ. లక్ష విలువ చేసే 24 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.ముందస్తు సమాచారం మేరకు జన్నారం రేంజ్ ఆఫీసర్ మమత,కవ్వాల డిప్యూటి ఫారెస్ట్ రేంజు ఆఫీసర్ విజయ్ కుమార్, రెండు రేంజుల ఫారెస్ట్ సెక్షన్,బీట్ అధికారులు హన్మంతరావు,బి.బోజనాయక్,శివకుమార్, పురుషోత్తం,పోచయ్య, మక్బూల్,తన్వీర్ పాషా, లవన్ కుమార్,విజయ్, అమృతరావ్,బేస్ క్యాంప్ సిబ్బంది ఆ గ్రామంలో సోదాలు చేసినట్లు ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ శనివారం ఉదయం తెలిపారు.రూ. ఒక లక్ష విలువచేసే 24 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.కేసు నమోదు చేశామని,నేరస్తుని గుర్తించామ‌ని, ప‌రారీలో ఉన్న అత‌డిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని ఆయన తెలిపారు.

Leave a Reply