COLLECTOR| శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా మొదటి రోజే వంద శాతం పింఛన్ల పంపిణీ (Distribution of pensions) పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ (Collector Shyam Prasad) సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచన చేశారు. ఈ మేరకు అందరూ ప్రత్యేకంగా తమ వంతు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఉదయం కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా (NTR BHAROSA) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛను పంపిణీ చేశారు. గ్రామంలోని సి.వెంకట రామిరెడ్డి, కురబ గంగన్న, వై.లింగారెడ్డి, అశ్వర్తమ్మలకు స్వయంగా పింఛను అందచేశారు. అలాగే ఉచిత బియ్యాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా పింఛను సక్రమంగా అందుతుందా..? లేదా..? సమస్యలు ఏమైనా ఉన్నాయా..? పింఛను పంపిణీ నిమిత్తం వచ్చిన వారి ప్రవర్తన ఎలా ఉంది..? గౌరవంగా మాట్లాడుతున్నారా..? లేదా…? అని లబ్ధిదారులతో (With beneficiaries) వివరాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ప్రతినెల 1వ తేదీనే ఉదయం పింఛన్లను అందజేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టరుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు(thank you) తెలియజేశారు. గ్రామంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి..? ఇప్పటి వరకు ఎంత మందికి పంపిణీ చేశారు.? అన్న వివరాలను అధికారులు అడిగి తెలుసుకుని మొత్తం నూరు శాతం పింఛన్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వివిధ అంశాల పై తగు సూచనలు (Instructions) జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏపీడీ నరసయ్య, ఎంపీడీవో ఏ నటరాజ్, సర్పంచ్ కురబ రవికుమార్, పంచాయతీ సెక్రటరీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

