కొల్లగొట్టేశారా…?
ఆంజనేయుడి ఆలయంలో చోరీ
పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన
తాండూరు, ఆంధ్రప్రభ : తాండూరు నియోజకవర్గం (Tandur Constituency) పెద్దేముల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయంలో ఉన్న హుండీలో డబ్బులు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం ((Hanuman Temple) లో రోజు మాదిరిగానే అన్ని కార్యక్రమాల అనంతరం దేవాలయాన్ని మూసివేశారు.
గురువారం ఉదయం వచ్చి చూసే సరికి దేవాలయంలో ఉన్న హుండీ ధ్వంసమై పోయింది. దీంతో దేవాలయంలో దొంగలు (Thieves) పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ వేణు దేవాలయానికి చేరుకుని విచారణ ప్రారంభిచారు. ప్రతినిత్యం భక్తులు వేస్తున్న డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు హుండీ వెనుక భాగం విడగొట్టి డబ్బులు చోరీ అయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.


