OG Movies | పవన్ న్యూయర్ గిఫ్ట్..

OG Movies | పవన్ న్యూయర్ గిఫ్ట్..
OG Movies | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2025లో వీరమల్లు, ఓజీ సినిమాల(Ozzie movies)తో ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో వీరమల్లు ప్లాప్ అయితే.. ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు 2026 సమ్మర్ లో.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. గత కొంతకాలంగా.. పవన్, సురేందర్ రెడ్డి కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కాంబో మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ఆలస్యం అయ్యింది.
ఇప్పుడు ఈ కాంబోలో సినిమాను అనౌన్స్ చేశారు. జైత్రరామ మూవీస్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వక్కంతం వంశీ కథను అందించారు. ఏజెంట్ సినిమా(Agent Movie) తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. ఏది సెట్ కాలేదు.

ఆఖరికి పవన్ ఓకే చెప్పడంతో ఈరోజు ఈ సినిమాను ప్రకటించారు. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి.. పవర్ స్టార్ ను సురేందర్ రెడ్డి ఎలా చూపిస్తారో.. అసలు కథ ఏంటో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
