పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఓజీ’ (OG)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణం వహిస్తున్నాడు.

‘ఓజీ’ కోసం అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో భారీగా పోస్టులు షేర్ చేస్తూ మూవీ టీమ్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా ‘ఓజీ’కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 2న విడుదల కానుంది అని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. అగ్నితుఫాన్ రాబోతుంది… సిద్ధంగా ఉండండి’’ అనే బలమైన క్యాప్షన్‌తో పోస్టర్‌ను శేర్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఫస్ట్ సింగిల్‌తో ‘ఓజీ’ హవా మళ్లీ స్టార్ట్ కానుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కొంత భాగం షూటింగ్ పూర్తయినా, పవన్ రాజకీయాలలో బిజీ కావడంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం వచ్చింది. తాజాగా చిత్రబృందం మళ్లీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

Leave a Reply