ఎంపి కేశినేని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు

ఎంపి కేశినేని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు

విజయవాడ, ఆంధ్రప్రభ : క‌ర్నూలు ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజుగురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధ‌వారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దావెంక‌న్న‌తో క‌లిసి ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఎంపి కేశినేని శివనాథ్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ శాలువాతో స‌న్మానించి కొండ‌ప‌ల్లి బొమ్మ బ‌హుక‌రించారు. అనంతరం వీరంతా కాసేపు మార్చిలో జ‌ర‌గ‌బోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు.

Leave a Reply