అమ్మవారికి నవ ధాన్యాలతో నైవేద్యం
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది తీరాన గల పద్మల్ పురి కాకో ఆలయంలో దండారి ఉత్సవాలలో భాగంగా భక్తులు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) నుండి కాకుండా మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు ప్రత్యేక వాహనాలలో తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన అర్ధిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి(Kotnaka Tirupati) అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయం కమిటీ సభ్యుడు, చైర్మన్‌ను గిరిజనులు(tribals) సంప్రదాయ వాయిద్యాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుస్సాడి(Gussadi) నృత్యాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి గిరిజన మహిళలు నవ ధాన్యాలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడమ్మ అంటూ మొక్కుకుని మొక్కులు తీర్చుకున్నారు.