ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రభ బ్యూరో ( రాయలసీమ) : శ్రీ రామనవమి ఉత్సవాల వైభవంతో కనువిందు చేస్తున్న ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఈరోజు రూ.6 కోట్ల విలువైన మూడు బంగారు కిరీటాల సమర్పణ జరిగింది. ప్రముఖ పెన్నా సిమెంట్ సంస్థ అధినేత పెన్నా ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివచ్చి స్వామికి సమర్పించారు.
ఇవాళ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ కిరీటాలను వారు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావులకు అందచేశారు. ఆలయంలోని మూలమూరతులైన సీతా రామ లక్ష్మణుల కోసం రూ. 6.60 కోట్ల వ్యయంతో విలువైన రాళ్ళను పొదిగించి చేయించిన ఆ మూడు బంగారు కిరీటాల బరువు 7 కిలోగ్రాములని టీ టీ డి ప్రకటించింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూల మూర్థులకు అలంకరించారు.
