Odisha CM | పెట్టుబడులు పెట్టండి..

Odisha CM | పెట్టుబడులు పెట్టండి..
- ప్రోత్సాహకాలు అందిస్తాం
- ఒడిస్సా సీఎం మొహం చరణ్
Odisha CM | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. అత్యధిక ప్రోత్సాహాకాలు అందిస్తామని ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ (Mohan Charan) పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయలో ఒడిశా ఇన్వెస్టర్ మీట్ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఒడిశా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ప్రభుత్వం (GOVT) తరఫున పరిశ్రమలకు అత్యధిక ప్రోత్సాహకాలు తమ రాష్ట్రంలో అందిస్తున్నామని, అత్యధిక సబ్సిడీలు ఇస్తామని తెలియజేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా సురభి గ్రూప్స్ చైర్మన్ సురభి హరేందర్రావు ఒడిస్సా సీఎంను శాలువాతో సత్కరించి ఫిలిగ్రీమ్ అందించారు.
