ODI – IND vs SL | ఉంత్కంఠ పోరులో భార‌త్ పై శ్రీలంక విజ‌యం..

శ్రీలంక : కొలంబోలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక మహిళా జట్టు విజయం సాధించింది. టీమిండియాతో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక జట్టు 3 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 275 ప‌రుగులు వబాదింది. 276 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన శ్రీలంక… 7 వికెట్లు న‌ష్టపోయి 278 ప‌రుగులు బాదింది. దీంతో టీమిండియా పై శ్రీలం 3 వికెట్ల‌తో విజ‌యం సాధించింది.

శ్రీలంక బ్యాట‌ర్ల‌లో హర్షిత సమరవిక్రమ (53), నీలక్షికా సిల్వా (56) అర్ధ‌శ‌త‌కాల‌తో చెల‌రేగారు. వారితో పాటు హాసిని పెరీరా (22), విష్మి గుణరత్నే (33), కవిషా దిల్హరి (35) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణ 3వికెట్లు తీయ‌గా.. అరుంధ‌తి, ప్రతీక రావల్, శ్రీ చరణి ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు..

అయితే, అంత‌కముందు బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయింది. కీలక ప్లేయ‌ర్లంతా స్వ‌ల్ప ప‌రుగుల‌కే ఔట‌య్యారు. రిచా ఘోష్ (50) హాఫ్ సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికీ.. మిగిలిన వారు ఫేయిల్ అవ్వ‌డంతో భారీ ప‌రుగులు న‌మోదు చేయ‌డంలో భార‌త్ విఫ‌ల‌మైంది.

శ్రీలంక బౌల‌ర్ల‌లో సుగంధిక కుమారి, చామరి అథపత్తు 3వికెట్లు తీయ‌గా.. దేవ్మీ విహంగా, ఇనోకా రణవీర తలా ఒక వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *