observation | స్టేడియంను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

observation | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన స్టేడియంను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఇవాళ పరిశీలించారు. వందలాది మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన స్టేడియం లేక క్రీడాకారులు వెలుగులోకి రాకుండా పోతున్నారని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు మక్తల్ పట్టణంలో ఉన్నందున నూతన స్టేడియం నిర్మించాలని తలపెట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్టేడియం నిర్మాణ పనులను అధికారులు నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియం నిర్మాణం నమూనాను మంత్రి పరిశీలించారు. మంత్రి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, మెదరి శ్రీనివాస్, కావాలి తాయప్ప, వాకిటి శ్యామ్, నాగరాజు, సాలంబిన్ ఉమర్ బస్రవి, తదితరులున్నారు.

Leave a Reply