నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్యని ఎంపీ ధర్మపురి కలిశారు. ఈరోజు (శుక్రవారం) జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో ఎంపీ ధర్మ పురి అరవింద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలు, పలు అంశాలపై సిపితో ఎంపీ చర్చించారు. ఎంపీ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఉన్నారు.
