భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో పోషణ మాసోత్సవం
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: సరైన పోషణ తో ఆరోగ్య వంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ అధికారి మల్లీశ్వరి అధ్యక్షతన పోషణ మాసం ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీఎస్ఆర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ నవీన్ రెడ్ది, డీఈవో రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. మధుసూదన్ లు పాల్గొన్నారు.

ముందుగా అంగన్‌వాడీలు స్వయంగా తయారు చేసిన పలురకాల ఫుడ్ స్టాల్స్ ను అతిథులు పరిశీలించి, స్వయంగా రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలు, బాలికలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం పై అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షయచిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.