రామచంద్రాపురం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, మూడు ముళ్లు వేసిన భర్త భార్యను అడ్డం పెట్టుకుని నీఛమైన పనులకు పాల్పడ్డాడు. తన భార్యతో నగ్నంగా వీడియో కాల్స్ చేయించి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. నగ్న వీడియో కాల్స్ చేయించి సొమ్ము లక్షలకు లక్షలు పోగేసుకున్నాడు.
అయితే, అది మంచిది కాదని వద్దని వారించిన భార్య మాటను పెడచెవిన పెట్టి బలవంతంగా ఆమెతో నీచమైన పనులకు చేయించాడు. ఈ వ్యవహారం అంతా వద్దని ఇకనైనా బుద్ధిగా బ్రతుకుదామని చెప్పిన భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను బజారుకు ఈడుస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తాళలేక విడాకుల నోటీసు సైతం ఇచ్చానని ఆము తెలిపింది.
ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారు పట్టించుకోలేదని సదరు మహిళ తెలిపింది. అలాగే తన భర్త చేస్తున్న వేధింపులపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.
మరో కోణం
బాధితురాలి ఆరోపణలపై కుటు-ంబ సభ్యులు స్పందించారు. సదరు మహిళ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆమే డబ్బు కోసం యాప్ డౌన్ లోడ్ చేసుకుందని.. వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు ఆ దారుణాన్ని తమపైకి నెడుతోందని ఆరోపించారు. ఆమె ఆరు నెలల నుంచే ఇంటికి రాకుండా బయట ఉంటోందని, ఇప్పుడు డబ్బు కోసం ఇలా తమపై నిందలు వేస్తోందని అన్నారు.