NTR | ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

కార్యక్రమంలో పాల్గొన్నఎంపీ మహేష్ యాదవ్
NTR | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు నగర శివారులలోని సీతాపురం వద్ద ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎంపీ మహేష్ యాదవ్ చేతుల ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ తోపాటు స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, ఆయన వల్లే ఎంతో మంది బీసీలకు రాజకీయ భవిష్యత్తు లభించిందని, తెలుగు జాతి మరిచిపోలేని మహా మనిషి అని ఎంపీ మహేష్ యాదవ్ కొనియాడారు.
