తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు సుస్థిర స్థానం..

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు సుస్థిర స్థానం..

విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ,ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు ఘన నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలను ఈ సందర్భంగా ఎంపీ శివనాధ్‌తో పాటుగా ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొనియాడారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, నాయకులు కోనేరు కిషోర్, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనగా నందమూరి రామకృష్ణను ఈ సందర్భంగా ఎంపీ శివనాద్ తదితరులు ఘనంగా సత్కరించారు. పాతాళ భైరవి సినిమా విడుదల అయ్యి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు సంతోషాన్ని పంచుకున్నారు.

Leave a Reply