NTR | విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

NTR | గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను గన్నవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విగ్రహాన్ని క్రేన్ సహాయంతో పీఠంపై అమర్చుతున్న ప్రక్రియను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… ఎన్టీఆర్ విగ్రహం గన్నవరం నడిబొడ్డున ఒక విశిష్ట గుర్తింపుగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహం చుట్టూ జరుగుతున్న ఇతర నిర్మాణ పనులను, నాణ్యతను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నందున, ఎక్కడా జాప్యం లేకుండా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

NTR

నిర్ణీత గడువులోగా విగ్రహా ఆవిష్కరణకు సిద్ధం చేయాలని, ఫినిషింగ్ పనుల్లో ఏమాత్రం రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం గన్నవరం నియోజకవర్గానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, గన్నవరం టౌన్ టీడీపీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, రాష్ట్ర టీడీపీ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్నా, పాలడుగు నాని, బుస్సే నాగప్రసాద్, కాసర్నేని రంగబాబు, తంగిరాల శ్రీనివాసరావు, జాస్తి మురళీకృష్ణ, సూరిబోయిన రాంబాబు, మోర్ల రాంబాబు, మద్దినేని వెంకటేశ్వరరావు, ఏఈ దాసు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply