- ధర, స్పెసిఫికేషన్స్ ఏంటంటే
లండన్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ నథింగ్ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మార్చి 04 మధ్యాహ్నం 3:30 గంటలకు, కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 3aని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందే, ఈ ఫోన్ ఫీచర్లు వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో లీక్ అయ్యాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ రూ.30,000 లోపు ధరకే లభించే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తొంది. మరోవైపు, ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి స్మార్ట్ఫోన్ల మాదిరిగానే బ్లాక్ & వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక ఫోటోల ప్రకారం, నథింగ్ ఫోన్ 3a ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్ఫేస్తో కూడా రానుంది.
లీకైన నథింగ్ ఫోన్ 3ఎ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలిస్తే..
- 6.77 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే
- 1080 x 2412 పిక్సల్స్ రిజల్యూషన్
- 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్
- నథింగ్ ఓఎస్ 3.1 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం
- 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్
- ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 4K వీడియో రికార్డింగ్
- అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
- 5జీ సపోర్ట్
- యూఎస్బీ టైప్-సీ పోర్ట్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- వైట్, బ్లాక్ కలర్స్