Not following the menu | గుడ్లను చూసి అవాక్కైన అధికారులు
Not following the menu | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో బొజ్జ గాని శ్రీనివాసరావు, ఎంఈఓ ఈ ఎల్ సి కేశవరావు, డిప్యూటీ తహసీల్దార్ ఎన్.అరవింద్, జి సి డి ఓ బాపట్ల విశ్వ భారతి సందర్శించి వంటశాలలోమధ్యాహ్న భోజనాన్ని, వంటలను, రికార్డులను పరిశీలించారు.

బాలికలు భుజించే మధ్యాహ్న భోజనం(Lunch)లో కుళ్లిపోయిన గుడ్లను వడ్డించటం చూసి అదికారులు(officers) అవాక్కయ్యారు. బాలికలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, నాణ్యమైన భోజనం కూడా వడ్డించడం లేదని బాలికలు తెలపటంతో అధికారులు ఎస్ఓ ఎం శ్యామల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాలికలకు వడ్డించాల్సిన చికెన్ కూర స్థానంలో క్యాబేజీ కూర వడ్డించారని అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
ఎ.కొండూరు కేజీబీవీలో 241 మంది బాలికలు(241 girls) 6నుండి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారని, బాలికలను మెనూ విషయమై విచారించగా వారంలో నాలుగు రోజులు మాత్రమే గుడ్డు పెడుతున్నారని, మిగిలిన రోజుల్లో మెనూ పాటించడం లేదని అధికారులు తెలిపారు. పాఠశాల, కళాశాలలో నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని ప్రిన్సిపాల్ ను అడిగితే దూషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాలికలు అధికారులకు తెలిపారు.
గత నెల రోజులుగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన భోజనం వడ్డించడం లేదని, మెనూ పాటించటం(menu not followed) లేదని అధికారులతో తెలిపారు. వివిధ పత్రికల్లో ఎస్ ఓ మెనూ పాటించడం లేదని ప్రచురితమైనప్పటికీ ఈ రోజు బాలికలకు కుళ్లిపోయిన గుడ్లు వడ్డించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై అధికారులు ఎస్ ఓ ను వివరణ కోరగా తాను రెడ్డిగూడెం మండలం రంగాపురం కేజీబీవీ పాఠశాల(school) కళాశాలలో ఎస్ ఓ గా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, జిల్లా అధికారులు తనను ఎ. కొండూరు ఇన్చార్జ్ ఎస్ ఓ గా చార్జ్ అప్పగించారని తెలిపారు. తనకు అదనపు బాధ్యతలు తొలగించమని ఏపీసీకీ లిఖితపూర్వకంగా వ్రాసి తెలియపరచుకున్నానని, అయినప్పటికీ నేటి వరకు తనకు అదనపు బాధ్యతలు తొలగించలేదని వివరణ ఇచ్చారు.
ఈ విషయమై అధికారులను విలేకరులు వివరణ కోరగా… ఎ. కొండూరు కేజీబీవీలో ఎస్ ఓ మెనూ పాటించడం లేదని, బాలికలకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని జిల్లా కలెక్టర్ కు, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఇకపై పాఠశాలలో క్రమం తప్పకుండా మెనూ పాటించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంఘం నాయకుడు బి.గోపిరాజు, జిల్లా విద్యార్థి సంఘం నాయకుడు, ఎం.కుమార్ నాయక్, పాల్గొన్నారు.


