నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం

నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట(Nagireddypet) మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాయి. మండలంలో ఒక జెడ్పీటీసీ(ZPTC) స్థానానికి, 10 ఎంపీటీసీ(MPTC)ల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రారంభించారు.

జెడ్పీటీసీ స్థానానికి ఎంపీడీవో కార్యాలయంలో, ఎంపీటీసీ స్థానాలకు గోపాల్ పెట్(Gopal Pet) గ్రామ‌పంచాయితీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొదటి విడతలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషనల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందు కోసం ఆయా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ రోజు నుండి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ మేరకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న జగిత్యాల జిల్లాలోని 10 మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Leave a Reply