Nominations | ముగిసిన నామినేషన్ల గడువు

Nominations | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. రేపు (శనివారం) అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Leave a Reply