Nomination | రెండవసారి అవకాశం ఇవ్వండి..

Nomination | రెండవసారి అవకాశం ఇవ్వండి..
- గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా…
Nomination | కేరమేర, ఆంధ్రప్రభ : రెండవసారి తమకు అవకాశం ఇస్తే ప్రజాసేవకు అంకితమవుతామనే ఉద్దేశంతో స్థానిక ఎన్నికలలో రెండవసారి పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. వచ్చే ఎన్నికలలో లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజల కష్టాలు పాలుపంచుకుని, కష్టాలు తీరుస్తానని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరా మేరీ మండలం ఖైరీ గ్రామానికి చెందిన లెండు గుర విజయలక్ష్మి అన్నారు.
గత ఐదు సంవత్సరాలు గ్రామపంచాయతీలో 30 మందికి వృధాప్య వికలాంగుల పింఛన్లు, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య, మురికి కాల్వల సమస్య తీర్చానని ఈసారి అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సాధించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తమకు గ్రామ ప్రజలు అవకాశమిస్తే అనేక సంక్షేమ అభివృద్ధి(Welfare development) పనులను చేపడతానన్నారు.
రెండోసారి అవకాశం ఇస్తే గ్రామంలోని అన్ని మౌలిక వసతుల కొరకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. నామినేషన్(Nomination) పరిశీలన ఉపసహరణ అనంతరం ఎల్ విజయలక్ష్మికు అధికారులు లేడీస్ పర్స్ గుర్తు కేటాయించారు. మీ అమూల్యమైన ఓటు లేడీస్ పర్స్ గుర్తుకు వేసి గెలిపించగలరని కోరుచున్నాను.
