యూరియా కొరత లేదు

అదైర్యం పడొద్దు

వైసీపీ దుష్ప్రచారం నమ్మొద్దు

-రైతులకు  మంత్రి వాసంశెట్టి సుభాష్ హితవు

( ఆంధ్రప్రభ,  మచిలీపట్నం)

యూరియా కొరత ఉందంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ దుష్ప్రచారం దుష్ట ప్రచారం చేస్తోందని  కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో యూరియా కొరత లేదని కేవలం  వైసీపీ ప్రచారంతో  యూరియా కొరత వస్తుందేమోనని రైతులు ఊహించుకుని ఎక్కువ శాతం నిల్వ ఉంచుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పది రోజుల్లో 4 వేల  టన్నుల యూరియా కృష్ణాజిల్లా కి రాబోతుందని,  రైతులు అధైర్య పడవద్దని  స్పష్టం చేశారు. అధిక  మోతాదులు యూరియా వాడవద్దని రైతులకు ఆయన సూచించారు

Leave a Reply