జనావాసాల్లో వైన్స్‌కు నో !!

మోత్కూర్, (ఆంధ్రప్రభ): మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య నూతన వైన్స్ దుకాణాలు, పర్మిట్ రూములు ఏర్పాటవుతున్నాయన్న ఫిర్యాదులపై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు.

ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు.. వైన్స్ దుకాణాలు నివాస ప్రాంతాల మధ్య ఉండటంతో తీవ్ర అసౌకర్యం, భయాందోళనలు ఎదుర్కొంటున్నాం.. అని జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ విష్ణుమూర్తి ప్రస్తుత వైన్స్ దుకాణాలు, పర్మిట్ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ఆయనకు వినతి చేస్తూ.. నివాస గృహాల మధ్య కొత్త వైన్స్ లను ఏర్పాటు చేయరాదని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా నివాస ప్రాంతాల దూరంగా ఏర్పాటు చేసుకోవాల‌ని ఆయన కోరారు.

సూపరింటెండెంట్ విష్ణుమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే వైన్స్, పర్మిట్ రూమ్ అనుమతులు ఇస్తామ‌న్నారు. ప్రజలు స్పష్టంగా అభ్యంతరం తెలిపిన ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వడం జరగదని తెలిపారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రవిచంద్ర రెడ్డి, ఎస్సై క్రాంతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply