Nizampet | ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు..

Nizampet | ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు..

  • కిటకిటలాడిన ఆలయాలు..

Nizampet | నిజాంపేట , ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలను కిటకిటలాడాయి. ఈ మేరకు మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ దేవాలయంలో ఇవాళ‌ ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో రవి కుమార్ అన్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తిరుమల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకలకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామ ప్రజలు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ, ఆలయ చైర్మన్ అక్కల రామ్ రెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Nizampet

Leave a Reply