Nizamabad | సోలార్ ఫెన్సింగ్….

Nizamabad | సోలార్ ఫెన్సింగ్….

Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద కోతుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు తాటిపాముల లింబాద్రి చెప్పారు. ఈ రోజు కోతుల నివారణ కోసం ఆలయం వద్ద జరుగుతున్న సోలార్ ఫెన్సింగ్(Solar fencing) పనులను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ ఆలయం వద్ద విపరీతంగా కోతులు ఉండడం వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. వాటి నివారణ కోసం భక్తుల సహకారంతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయం చుట్టూ సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సోలార్ ఫెన్సింగ్ కోసం ముందుకు రావాలని ఆయన కోరారు. ఆలయానికి వచ్చే భక్తులకు(devotees) ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆలయంలో భక్తులకు పలు రకాల వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాన అధికారి శ్రీధర్, పాలకవర్గ సభ్యులు నీల ఆంజనేయులు, చికోటి ప్రభాకర్, ఆలయ పూజారి రాజేశ్వర శర్మ ఉన్నారు.

Leave a Reply