Nizamabad | పోలీస్ క‌స్ట‌డీలో నిందితుడి మృతి … బంధువుల ఆందోళ‌న

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద నేటి ఉద‌యం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల ఆ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్ జగిత్యాల జిల్లాలో శ్రీ రామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు . అయితే గల్ఫ్ లో ఉద్యోగాల పేరిట సంపత్ తమను మోసం చేశారని సైబర్ పోలీసులకు నిజామాబాద్ బాధితుల ఫిర్యాదు చేసారు. దాంతో ఈ నెల 4న సంపత్ తో పాటు మరో యువకున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు పోలీసులు.

విచారణ పేరిట ఈనెల 12 న కస్టడీలోకి తీసుకుని విచారణ నిర్వహించారు. అయితే నిన్న రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. విచారణ పేరిట సంపత్ ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్న మృతిని కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ఎదుట రాస్తా రోకో నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు రంగ ప్ర‌వేశం చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు..

మృతిపై విచార‌ణ జ‌రుగుతోంది : ఏసీపీ రాజా వెంక‌ట‌రెడ్డి
సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడు. ఇది వైద్యులు కూడా చూశారని చెప్పారు. రిమాండ్ ఖైదీగా ఉన్న సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోందని, ముగ్గురు వైద్యుల బృందం సంపత్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారని తెలిపారు. అలాగే అనుమానస్పద మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *