Nizamabad | ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు…

Nizamabad | ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు…

Nizamabad | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు సిద్దా గౌడ్ కొబ్బరికాయలు కొట్టి ఎడ్లబండ్ల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ప్రజలు ఊరేగింపును కనులారా తిలకించారు.

అనంతరం ఆలయం వద్దకు ఎడ్లబండ్ల ఊరేగింపు వెళ్ళగా అక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం అనంతరం అమ్మవారికి మొక్కులు, చెల్లించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply