Nirmal | 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Nirmal | 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal |నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రం ఈ రోజు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీసు పరేడ్ వాహనంపై పరేడ్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీసుల ఉత్తమ సేవలకు గాను పలువురికి మెడల్స్ అందించారు. ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రాలు కొలమానమని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిళ, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, భైంసా ఎఎస్పీ రాజేష్ మీనా, అదనపు ఎస్పీలు సాయికిరణ్, ఉపేంద్రా రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.
