Nipha virus | ప్రపంచ ఆరోగ్య సంస్థ

Nipha virus | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత్ లో ‘నిఫా’ వైరస్ వ్యాప్తి వేళ.. ఆ వైరస్ తో ఎలాంటి ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తమ దేశంలోకి వచ్చే భారతీయులకు పలు ఆసియా దేశాలు పరీక్షలు నిర్వహిస్తుండడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. భారత్ లో నిఫా ప్రభావం తక్కువగా ఉందని, దానితో ప్రమాదమేమీ లేదని తెలిపింది. భారత్ పై ప్రయాణ, వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
