కాంటాక్ట్‌ లెన్సుకు నైట్‌ విజన్..

  • చైనా సైంటిస్టుల డిస్కవరీ

చీకట్లో కూడా చూడగలిగే కాంటాక్ట్‌ లెన్సులను చైనాకు చెందిన సైంటిస్టులు కనిపెట్టారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం సైన్స్‌ జర్నల్‌ సెల్‌లో ప్రచురితమైంది.

పరిశోధనా బృందానికి నేతృత్వం వహించిన చైనా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్టు టియాన్‌ క్స్యూ మాట్లాడుతూ.. లెన్సుల్లో వినియోగించిన నానోపార్టికల్స్‌ ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ను గ్రహించి దానిని మానవ నేత్రానికి కనిపించే కాంతి పౌన:పున్యాల్లోకి మారుస్తాయని తెలిపారు.

ఈ ఇన్‌ఫ్రారెడ్‌ కాంటాక్ట్‌ లెన్సులను ధరించినవారు కడకు కళ్లు మూసుకొని కూడా చూడగలరని చెప్పారు. కాంటాక్ట్‌ లెన్సులు హానికరం కాదని తేలిన తర్వాత వాటి పనితీరును మనుష్యులపైన, ఎలుకలపైన పరీక్షించినట్టు తెలిపారు.

Leave a Reply