Rtc Good News | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

Rtc Good News | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌

  • Rtc Good News | ఆర్టీసీలో మరో జాబ్ నోటిఫికేషన్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఆర్టీసీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఈ రోజు సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి నెల వారీగా వస్తున్న మహాలక్ష్మి(Mahalakshmi Scheme) టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని టీజీఆర్టీసీ(TGRTC) ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు రూ.237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ఇందుకు సంబంధించిన 7,980 కోట్ల రూపాయలు(7,980 crore rupees) ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు, ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆయ‌న ఆదేశించారు.

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్(action plan) సిద్ధం చేయాలని, పీఎం ఈ -డ్రైవ్(PM e-drive) కింద హైదరాబాద్‍కు కేటాయించిన రెండు వేల బస్సులు విడతల వారీగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి పొన్నం సూచించారు.

Leave a Reply