New Trend | సక్సెస్ కావాలంటే.. స్క్రీన్ ఎరుపెక్కాల్సిందేనా…?

New Trend | సక్సెస్ కావాలంటే.. స్క్రీన్ ఎరుపెక్కాల్సిందేనా…?
New Trend | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు తెర పై సినిమాలు(Movies on screen) చూస్తే.. ఎంత పద్దతిగా తీసారో అనిపిస్తుంటుంది. రక్తపాతం చూపించాల్సిన సన్నివేశమైనా సరే.. అది చూపించకుండా.. తీసేవారు. అంత జాగ్రత్తలు తీసుకునేవారు. అంతలా ఆలోచించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్(trend) మారింది. తెర పై ఎంత ఎక్కువ మందిని చంపినట్టు చూపిస్తే.. అంత పెద్ద హిట్ అవుతుంది అనేలా భీభత్సమైన రక్తపాతం తెర పై చూపిస్తున్నారు. మరి.. సక్సెస్ కావాలంటే.. స్క్రీన్ ఎరుపెక్కాల్సిందేనా..?
New Trend | 100 మందిని చంపిన మగధీర..

తెలుగు సినిమాలో వయొలెన్స్ చూపించాల్సి వచ్చినప్పటికీ దర్శకనిర్మాతలు(Directors and producers) జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. మగధీర సినిమాలో రామ్ చరణ్ 100 మందిని చంపే సీన్ ఉంటుంది. ఆ సీన్ గురించి ఇప్పటి జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్(A big hit) అవ్వడానికి ఆ ఎపిసోడ్ కూడా ఓ కారణం అని చెప్పచ్చు. అయితే.. మగధీర సినిమాలో 100 మందిని చంపినట్టు చూపించిన భయంకరమైన రక్తపాతం ఏమీ చూపించలేదు. దర్శకధీరుడు రాజమౌళి మరీ రక్తపాతం ఎక్కువ కాకుండా చూసుకున్నారు. కానీ.. ఆతర్వాత నుంచి ఫిల్మ్ మేకర్స్(Film makers) కొంత మంది ఎంత ఎక్కువ మందిని చంపినట్టు చూపిస్తే అంత పెద్ద హిట్ అవుతుందేమో అనేట్టుగా తెర పై భీభత్సం చూపిస్తున్నారు.
New Trend | సలార్.. భీభత్సం..

కంటెంట్ డిమాండ్ చేస్తే.. ఎంత హింసను అయినా సరే చూపించడానికి వెనకాడడం లేదు. ఈమధ్య కాలంలో వచ్చిన సలార్ సినిమా(Salaar movie) చూసాం. అందుతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భీభత్సం చూసాం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అంత హింస చూపించకపోతే బాగోదు అనుకున్నారో ఏమో కానీ.. సలార్ లో రక్తపాతాన్ని ఓ రేంజ్ లో చూపించారు. అంత రక్తపాతం చూపించినా జనాలు చూడడం మానలేదు కదా… బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. ఇందులోనే ఇలా ఉంటే.. ఇక సలార్ సీక్వెల్(Salar sequel) ఉందని ప్రకటించారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ కమిట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత సలార్ 2 చేయనున్నారు. మరి.. అందులో ఇంకెంత రక్తపాతం చూపిస్తారో అనేది ఆసక్తిగా మారింది.
New Trend | రక్తపాతంతో షేక్ చేసిన పుష్పరాజ్..

పుష్ప, పుష్ప2.. ఈ రెండు సినిమాలు ఎంతలా ఆకట్టుకున్నాయో చూశాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప.. ఇండియన్ బాక్సాఫీస్(Indian box office) ని షేక్ చేసింది. అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా పుష్పతో పోలిస్తే.. పుష్ప 2 సినిమాలో రక్తపాతం ఎక్కువుగా ఉంది. అయినప్పటికీ.. జనాలు చూడకుండా ఉండలేదు. ఇంకా చెప్పాలంటే.. పుష్ప 2 సినిమాను విరగబడి చూశారు. సౌత్ లో కంటే నార్త్ జనాలు(People of the North) ఎక్కువుగా ఈ సినిమాను చూడడం విశేషం. ఒకప్పుడు అయితే.. రక్తపాతం ఎక్కువ ఉన్న సినిమాలు చూసేవారు కాదు కానీ.. ట్రెండ్ మారింది కదా.. ఇలాంటి సినిమాలను ఎక్కువుగా చూస్తున్నారు.
New Trend | మేము రెడీ.. రౌడీ జనార్థన, మైసా..

నాని దసరా సినిమాలో ఎంత రక్తపాతం చూపించాడో చూశాం. అలాగే హిట్ 3(Hit 3) లోకూడా భీభత్సంగా చూపించాడు. ఇప్పుడు ప్యారడైజ్ అంటూ అంతకు మించిన రక్తపాతాన్ని చూపించడానికి వస్తున్నాడు. రీసెంట్ గా విజయ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్(Glimpse release) చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ మొహం మొత్తం రక్తంతో నిండిపోయింది. అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరికే అవతారంలో భయపెట్టేలా కనిపించాడు. సిక్స్ ప్యాక్(A six pack) బాడీ మీద కూడా రక్తం ఏరులై పారింది.
ఈ గ్లింప్స్ ఇలా ఉంటే.. నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న మూవీ మైసా(Movie Maisa) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మాస్ లేడీ గెటప్ లో చంపడానికి రెడీ అనేట్టుగా ఉంది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా నో ప్రాబ్లమ్ మేము స్క్రీన్ పై రక్తపాతం చూపిస్తామన్నట్టుగా కొంత మంది ఫిల్మ్ మేకర్స్ ఈ రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. మరి.. ఈ రక్తపాతం ట్రెండ్(A bloody trend) ఇంకెన్నాళ్లు ఉంటుందో.. ఈసారి ఎలాంటి ట్రెండ్ వస్తుందో చూడాలి.
CLICK HERE TO READ సరికొత్త అందాలు..