వ్యర్థం వదులు.. నగదు పట్టు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వ్యర్థం వదిలించు.. నగదు పట్టు అనే రీతిలో వేస్ట్ నీ క్యాష్ గా మార్చుకునే యంత్రాలన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అందుబాటులోకి తీసుకు వచ్చింది. తిరుమల పీఏసీ -5(Tirumala PAC-5) లో చెత్త వేసి నగదు పొందే కొత్తం యంత్రాన్ని భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కూల్ డ్రింక్ టిన్, టెట్రా ప్యాకెట్, రీసైక్లింగ్ చేసే అవకాశం ప్రతిఈ వస్తువును ఈ యంత్రంలో వేయాలి. ఫలితంగా రూ.5లోపు నగదు భక్తుడి(Devotee) ఖాతాలో జమ అవుతుంది. ఎంత నగదు చేరిందనే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. కూల్ డ్రింకు టిన్నులు.. టెట్రా ప్యాకెట్లను ఎక్కడ పడితే అక్కడ పడవేసి.. చెత్త ప్రాంతంగా మార్చొద్దు గురూ.. అందుకే వేస్టు వేసుకో.. క్యాష్ తీసుకో.. ఓకే..