హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ, ప్రభుత్వ భూములను కాపాడుతూ, చెరువులను , కుంటలను రక్షిస్తున్న హైడ్రా తన లోగో మార్చుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) లోగో మారింది. జలవనరుల శాఖను పోలి ఉండేలా అధికారులు కొత్త లోగోను రూపొందించారు. హైడ్రా అధికారిక ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ కు ఈ లోగోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు.
హైదరాబాద్ నగరంలోని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ఆక్రమణలను నిరోధించడానికి సీనియర్ ఐపిఎస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను కూల్చివేస్తూ హైడ్రా వార్తలో నిలిచింది.